జాతీయ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6 నుండి 8 వరకు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో జరగనున్న 42 వ జాతీయస్థాయి జూనియర్ అండర్ – 19 షూటింగ్ బాల్ చాంపియన్ షిప్ పోటిలకు స్థానిక పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 10 వ తరగతి విద్యార్థి డి.అశ్విత్ పటేల్ ఎంపికయ్యాడని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రితేష్ మెహతా తెలిపారు.
ఇటీవల మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో జరిగిన జూనియర్ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ చాంపియన్ షిప్ పోటీలలో అండర్-19 బాలుర జూనియర్ విభాగంలో డి. అశ్విత్ పటేల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన డి.అశ్విత్ పటేల్ ను పాఠశాల చైర్మన్ డా.ఈ. ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన,అనూకర్ రావు, రాకేష్, వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు రితేష్ మెహతా, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ , సమన్వయకర్తలు రాము,రబీంద్ర పాత్రో,హరిప్రియ,సరిత పి.ఇ.టి. లు గోలి సుధాకర్, సరిగోమ్ముల రాజు, పండుగ సంతోష్ పాల్గొన్నారు.
National sports: నేషనల్ జూ. షూటింగ్ బాల్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థి
అశ్విత్ పటేల్ కు ప్రత్యేక అభినందనలు