Sunday, November 16, 2025
HomeఆటNelakondapalli: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సాయి

Nelakondapalli: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సాయి

నేషనల్స్ కి మనోడు

ఈ నెల 4 నుంచి జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలంలోని బోదులబండకు చెందిన గండారపు వెంకటసాయి ఎంపికైయ్యారు. ఇటీవల హైద్రాబాద్ లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ 5 కేయం. క్రాస్ కంట్రీలో మూడో స్థానం సాధించి ప్రతిభ చూపారు.

- Advertisement -

ఈ నెల 4 నుంచి జార్ఖండ్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు నిర్వహకులు ఎంపిక చేశారు. గ్రామానికి చెందిన వెంకటసాయి ఖమ్మంలోని నయాబజార్ కాలేజీలో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయికి ఎంపికైన సాయిను పలువురు అభినందించారు. జాతీయ స్థాయిలో బోదులబండ సత్తా చాటాలని పలువురు పేర్కొన్నారు. కాంగ్రెస్ బీసీ సెల్ విభాగం పాలేరు డివిజన్ అధ్యక్షుడు జెర్రిపోతుల సత్యనారాయణ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad