Sunday, December 8, 2024
HomeఆటIndia map: తప్పుగా ఇండియా మ్యాప్ .. కివీస్ జట్టుపై తీవ్ర విమర్శలు

India map: తప్పుగా ఇండియా మ్యాప్ .. కివీస్ జట్టుపై తీవ్ర విమర్శలు

India map| భారత్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇండియా(INDIA) విచ్చేసిన న్యూజిలాండ్(New Zealand) జట్టు తొలి టెస్టులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన కివీస్.. భారత జట్టును సొంత గడ్డపై ఓడించి శభాష్ అనిపించింది. ఈ విజయంతో దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇదే ఊపులో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న బ్లాక్ క్యాప్స్ టీమ్.. ఇప్పుడు టీమిండియా అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. తమ ఎక్స్ ఖాతాలో భారతదేశం మ్యాప్‌ (India map)ను తప్పుగా చూపించడమే ఇందుకు కారణమైంది.

- Advertisement -

రెండో టెస్టు కోసం పుణెకు బయలుదేరేందుకు సిద్ధమైన కివీస్‌ జట్టు ‘ఎక్స్‌’ వేదికగా బెంగళూరు టూ పుణె అంటూ భారతదేశం మ్యాప్‌ను షేర్ చేసింది. అయితే ఇందులో భారత సరిహద్దు భూభాగాన్ని తప్పుగా చూపించింది. ఇది గమనించిన భారత అభిమానులు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాసేపట్లోనే ఈ పోస్టు కాస్త వైరల్‌గా మారడంతో న్యూజిలాండ్‌ జట్టు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘భారత్‌ భూభాగాలపై అవగాహన లేకుండా పోస్టు పెట్టడం సరికాదు.. పోస్టు చేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన న్యూజిలాండ్‌ క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ ఆ పోస్టును తొలగించింది. అయితే అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కాగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో తొలి రోజు ఆట వర్షం కారణం రద్దు కాగా..రెండో రోజు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. దీంతో రోహిత్ సేన కేవలం 46 పరుగులకే చాప చుట్టేసింది. అనంతం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు 402 పరుగులకు ఆలౌట్ కాగా.. 362 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే తీవ్ర ఒత్తిడితో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 462 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కివీస్ జట్టు ముందు 107 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచింది. ఈ లక్ష్యాన్ని కివీస్ జట్టు సులభంగా ఛేదించి విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈనెల 24న పుణే వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News