IND vs AUS Test Series| వచ్చే నెలలో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-A జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక అభిమన్యు ఈశ్వరన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రుతురాజ్ సారథ్యంలోని భారత-A జట్టు, ఆస్ట్రేలియా-A జట్టుతో రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచులు, భారత జట్టుతో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది ఈ జట్టులో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)కి చోటు కల్పించారు సెలెక్టర్లు.
భారత-A జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాల్, నవదీప్ సైనీ, మానవ్ సుతార్, తనుశ్ కోటియన్.
అయితే నితీష్ కుమార్ రెడ్డికి భారత్A జట్టులో చోటు కల్పించడంతో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసే టీమిండియా జట్టులోనూ అతడికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నితీష్‌తో పాటు ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur)ను సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో శార్దూల్ అద్భుతంగా ఆడి జట్టుకు విజయాలు అందించాడు. అందుకే ఇప్పుడు కూడా జట్టులోకి తీసుకోనున్నారట. వీరితో పాటు సీనియర్ ఆటగాళ్లు పూజారా, రహానే పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాగా ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి నవంబర్ 22 నుంచి 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ను కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది.
తొలి టెస్టు: నవంబర్ 22-26 (పెర్త్)
రెండో టెస్టు: డిసెంబర్ 6-10, డే/నైట్ (ఆడిలైడ్)
మూడో టెస్టు: డిసెంబర్ 14-18 ( బ్రిస్బేన్)
నాలుగో టెస్టు: డిసెంబర్ 26-30, బాక్సింగ్ డే టెస్టు (మెల్‌బోర్న్)
ఐదో టెస్టు: జనవరి 3-7 (సిడ్నీ)