2028 Olympics Updates: 2028 సమ్మర్ ఒలింపిక్స్ లాస్ ఏంజెలిస్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి జరిగే ఒలింపిక్స్ లో 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ రీఎంట్రీ ఇవ్వనుంది. టీ 20 ఫార్మాట్‌లో ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో పాల్గొనే టీమ్స్ ను రీజియన్ల వారీగా టాప్ ర్యాంక్ జట్లను ఐసీసీ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అర్హతకు సంబంధించిన సర్వసభ్య సమావేశాన్ని సింగపూర్ వేదికగా జూలైలో ఐసీసీ నిర్వహించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈసారి ఒలింపిక్స్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లకు చోటుదక్కే అవకాశాలు కష్టమని కూడా ఆ రిపోర్టు స్పష్టం చేసింది.
ఎలా ఎంపిక చేయనున్నారు?
ఒలింపిక్స్ కు ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆతిథ్య దేశంగా అమెరికాకు చోటుదక్కే అవకాశముంది. ఆరో టీమ్ ను ఎలా ఎంపిక చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో వెనుకబడి ఉన్న పాక్, కివీస్ జట్లకు చోటు కష్టమేనని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రాంతీయ అర్హత విధానాన్ని అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also read: IND VS Pak – భారత్-పాక్ సెమీస్ కి ముందే తప్పుకున్న స్పాన్సర్లు!
ఆ మూడు జట్లకు చోటు కష్టమే..!
ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఓషియానియా దేశాలకు సంబంధించి ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. దీని కారణంగా ఒలింపిక్స్ నుంచి కివీస్ ఔటయ్యే అవకాశం ఉంది. మరోవైపు పాకిస్థాన్ ఎనిమిదో ర్యాంకులో, శ్రీలంక ఏడో ర్యాంకులో ఉన్నాయి. అయితే ఆసియా నుంచి టీమిండియా టాప్ లో ఉన్న కారణంగా ఈరెండు జట్లకు ఛాన్స్ కష్టమే. దీంతో పాక్, భారత్ పోరు చూడాలన్న అభిమానులకు నిరాశే అని చెప్పాలి. ఇంకోవైపు అతిథ్య దేశంగా యూఎస్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో.. వెస్టిండీస్ కు కూడా చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.


