బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టను 181 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో భారత జట్టుకు 4 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆసీస్ బ్యాటర్లలో వెబ్‌స్టర్(57) పరుగులతో రాణించగా.. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్‌స్టాస్ (23), అలెక్స్ కేరీ (21) ఫర్వాలేదనిపించారు. ఇక ఉస్మాన్ ఖవాజా 2, లబుషేన్ 2, ట్రావిస్ హెడ్ 4, పాట్ కమిన్స్ 10, మిచెల్ స్టార్క్ 1, నాథన్ లైయన్ 7*, బోలాండ్ 9 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, సిరాజ్ 3, నితీశ్ 2, బుమ్రా 2 వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
ఇన్నింగ్స్ మధ్యలో భారత కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా మైదానం వీడాడు. మెడికల్ సిబ్బందితో కలిసి స్కానింగ్‌కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బుమ్రాకు గాయం ఉన్నట్లు తేలితే టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ అనే చెప్పాలి. సిరీస్ విజేతగా తేల్చే మ్యాచ్‌లో బుమ్రా ఆడకపోతే కష్టమమవుతుంది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బుమ్రా గైర్హాజరీలో విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నాడు.