Sunday, July 7, 2024
HomeఆటPatnam: క్రీడాకారులకు కేసీఆర్ హయాం స్వర్ణయుగం

Patnam: క్రీడాకారులకు కేసీఆర్ హయాం స్వర్ణయుగం

తెలంగాణ క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం

తెలంగాణలో క్రీడాకారులకు సీఎం కేసీఆర్ పాలనా కాలం స్వర్ణయుగంగా నిలుస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. తొలి తెలుగు భారత అంతర్జాతీయ ఓపెన్ వాటర్ స్విమ్మర్ గోలి శ్యామల మంత్రి మహేందర్ రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్ 3న కలకత్తాలో జరిగిన భగీరథ నదిలో 81 కిలోమీటర్ల దూరం కేవలం 13 గంటల్లో ఈదిన సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి శ్యామలను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

ఓపెన్ వాటర్ స్విమ్మర్ గోలి శ్యామల గత ఏడాది గోలి శ్యామల తాలైమన్నారు (శ్రీ లంక) నుండి ధనుష్కోడి (భారత దేశం) వరకు హిందూ మహాసముద్రంలో 13:43 గంటలు ఈది ప్రపంచ రికార్డులు స్థాపించడం పట్ల అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 36 కి.మీ గల కేటలిన ఛానల్ ను 20 గంటల్లో ఈదిన తొలి తెలుగు మహిళ గా భరత దేశపు ఖ్యాతిని, తెలంగాణ సమాజ గౌరవాన్ని దశ దిశలకు వ్యాపింపజేస్తూ మువ్వన్నెల జెండాను ఎగురావేశారని అభినందించారు. రానున్న రోజుల్లో గోలి శ్యామల పాల్గొనే పోటీలకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్రీడా అంశాలలో నైపుణ్యం గల క్రీడాకారులను ప్రభుత్వం ఆదరిస్తుందని, వారికి పెద్దపీట వేసి వారిని అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా చూస్తుందని మహేందర్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News