రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన తాలూకా లెవెల్ అథ్లెటిక్స్ విభాగంలో పెద్దకడబూరు మండలం కల్లుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పి.రుక్మిణి 8వ తరగతి 100 మీటర్స్ లో 3 సంవత్సరాలు తనదైన శైలిలో పరుగు పందెములో హ్యాట్రిక్ విజయం సాధించింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో జరిగిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని పి.రుక్మిణిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరాం మోహన్, ఉసెనప్ప, పిడి.శశికళ, పి.ఈ.టి దుబ్బన్న ప్రత్యేకంగా అభినందించారు.
లాంగ్ జంప్ విభాగంలో కూడా 3 సంవత్సరాలు ఏకధాటిగా హ్యాట్రిక్ సాధించడంతో పాటు, గోల్డ్ మెడల్ ను గెలిచింది. పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గెలుపొందిన విద్యార్థిని అభినందిస్తూ ఇంకా మరెన్నో విజయాలను విద్యార్థులు సాధించాలని మన గ్రామానికి మన పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని ..ఇలాంటివి ఎన్నో విజయాలు సాధించాలని గెలుపు పొందిన విద్యార్థిని, అలాగే విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.