Thursday, February 6, 2025
HomeఆటIND vs ENG: తగ్గేదేలే.. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పుష్పరాజ్

IND vs ENG: తగ్గేదేలే.. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పుష్పరాజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) న‌టించిన ‘పుష్ప 2′(Pushpa 2) ఇండియన్ బాక్సాఫీస్ బ్లాక్‌బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రంలో గంగ‌మ్మ జాత‌ర ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ ఎపిసోడ్‌లో బ‌న్నీ గంగ‌మ్మ తల్లి గెట‌ప్‌లో అలరించాడు. తాజాగా నాగ్‌పుర్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్(IND vs ENG) మ్యాచ్‌లో ఓ అభిమాని గంగమ్మ తల్లి గెటప్‌లో సందడి చేశాడు. దీంతో కెమెరామెన్లు ఆ అభిమానిపై ఫోకస్ చేశారు. దీంతో అతడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో మ్యాచ్ చూసేందుకు పుష్పరాజ్ వచ్చాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ 47.4 ఓవ‌ర్ల‌లో 248 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ బట్లర్‌ (52), జాకబ్‌ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఫిలిప్‌ సాల్ట్‌ 43 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో అరంగేట్ర బౌలర్‌ హర్షిత్‌ రాణా తొలి మ్యాచ్‌లోనే కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇక రవీంద్ర జడేజా 3 వికెట్లు.. షమి, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ తలో వికెట్ తీశారు. నిర్ణీత లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News