Kapil Show: ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ షోలో సినీ తారలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు భారత ఆటగాళ్లు కూడా కనిపిస్తారు. ఈసారి క్రికెటర్లు రిషభ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, అభిషేక్ శర్మ, గౌతం గంభీర్ లు వచ్చారు. ఈ ఎపిసోడ్ లో ఫన్నీ మూమెంట్స్, అలాగే క్రికెటర్లతో అర్చనా సరదా సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి.
ఈ ఎపిసోడ్ లో భారత మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, యువ క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి మాట్లాడాడు. అభిషేక్ శర్మ భారత క్రికెట్ భవిష్యత్తు అని, అతడి ప్రతిభని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని ప్రశంసించాడు. అర్చన కూడా అభిషేక్‌ను స్వాగతిస్తూ అతడు చాలా అందమైన అబ్బాయి, కపిల్‌లానే అమృత్‌సర్ నుంచి వచ్చాడు అని చెప్పింది.
Readmore: https://teluguprabha.net/sports-news/venus-williams-victory/
రిషభ్ పంత్ కారు ప్రమాదం గురించి అర్చన అతడిని అడిగింది. దానికి అనుకోకుండా జరిగిన కారు ప్రమాదం జీవితంపై కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని, చాలా నేర్పిందని రిషభ్ పంత్ సమాధానమిచ్చాడు. తాను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించానని పంత్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ఎపిసోడ్ కి హైలైట్ గా చాహల్ నిలిచాడు.
రిషభ్ పంత్ చాహల్ చేతికి ఒక రింగ్ పెడుతూ ఆటపట్టించారు. అర్చన కూడా మీరిప్పుడు అతడితో నిశ్చితార్థం చేసుకున్నారా? అని సరదాగా అడిగింది. ఇక్కడి సంభాషణ చాలా ఎంజాయ్ చేస్తారు. చాహల్‌ను అర్చన తన ఐలాండ్ ఇంటికి ఆహ్వానించగా, అతడు ముంబైకి రావడానికి సమయం దొరకదని సరదాగా చెప్పారు. రిషభ్ వెంటనే చాహల్ ఎప్పుడూ ఇక్కడే ఉంటాడని ఆటపట్టించాడు. చాహల్ ముంబైలోని ఆర్జే మహ్వాష్‌తో డేటింగ్ రూమర్స్ గురించి రిషభ్ నోరు విప్పాడు. చాహల్ అందరికీ చెప్పేయ్ అని సమాధానమిచ్చాడు.
యుజ్వేంద్ర చాహల్-ఆర్జే మహ్వాష్ గత ఏడాది నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లలో మహ్వాష్ చాహల్‌కు మద్దతుగా కనిపించడం, ఇద్దరూ డిన్నర్లు, హాలిడేస్‌లో కలిసి ఉండటం వంటివి వారి డేటింగ్ రూమర్స్‌కు ఆజ్యం పోశాయి. ఇటీవల ఒక యాడ్‌లో కలిసి కనిపించడం ఈ ఊహాగానాలను మరింత బలపరిచింది.


