Friday, November 22, 2024
HomeఆటTeam India : టీమ్ఇండియాకు మ‌రో క‌ష్టం వ‌చ్చిప‌డింది

Team India : టీమ్ఇండియాకు మ‌రో క‌ష్టం వ‌చ్చిప‌డింది

Team India : ఇప్ప‌టికే సిరీస్‌ను కోల్పోయిన భార‌త్‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఆఖ‌రి మ్యాచ్‌లోనైనా విజ‌యం సాధించి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న జ‌ట్టుకు మ‌రో క‌ష్టం వ‌చ్చి ప‌డింది. రెండో వ‌న్డేలో గాయ‌ప‌డిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మూడో వ‌న్డేకు దూరం అయ్యాడు. రోహిత్‌తో పాటు పేస‌ర్ బౌల‌ర్ దీప‌క్ చాహ‌ర్‌, కుల్దీప్ సేన్ సైతం గాయాల‌తో మూడో వ‌న్డే నుంచి త‌ప్పుకున్నారు. ఈ ముగ్గురు స్వ‌దేశానికి బ‌య‌లుదేరారు. దీప‌క్ చాహ‌ర్ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతుండ‌గా, కుల్‌దీప్ సేన్ వెన్నునొప్పి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని భార‌త కోచ్ రాహుల్ ద్ర‌విడ్ సైతం ధృవీక‌రించాడు.

- Advertisement -

రోహిత్ గాయం తీవ్ర‌త దృష్ట్యా టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండే అవ‌కాశాల గురించి తాను ఖ‌చ్చితంగా చెప్ప‌లేన‌ని ద్రవిడ్ చెప్పాడు. రెండో వ‌న్డేలో రోహిత్ ఆడిన ఇన్నింగ్స్‌ను ద్ర‌విడ్ ప్ర‌శంసించాడు. రోహిత్ బొట‌న‌వేలికి గాయం కావ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లాడు. కుట్లు ప‌డ్డాయి. బ్యాటింగ్ వెళ్లే ముందు డాక్ట‌ర్లు అత‌డికి ఇంజెక్ష‌న్లు ఇచ్చారు. అంత బాధ‌లో కూడా రోహిత్ అసాధార‌ణ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ ఎంతో ద‌గ్గ‌ర‌య్యాడు. టీమ్ఇండియా విజ‌యం కోసం ఎంతో కృషిశాడు. దుర‌దృష్ట‌వ‌శాత్తు చివ‌రిలో గెలుపును అందుకోలేక‌పోయిన‌ట్లు ద్ర‌విడ్ చెప్పాడు.

ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను కోల్పోయిన భార‌త్ వైట్ వాష్ నుంచి త‌ప్పించుకోవాలంటే చ‌టోగ్రామ్ వేదిక‌గా శ‌నివారం జ‌ర‌గ‌నున్న మూడో వన్డేలో విజ‌యం సాధించాల్సిందే. రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ దూరం కావ‌డంతో ఈ మ్యాచ్‌కు రాహుల్ కెప్టెన్సీ చేసే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News