ముంబై మాజీ కెప్టెన్, సెలెక్టర్ మిలింద్ రేగే(Milind Rege) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతితో ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో పాటు క్రికెటర్లు షాక్‌కు గురయ్యారు. 1960, 70ల్లో డొమెస్టిక్ క్రికెట్ లో స్టార్ స్పిన్నర్‌గా సత్తా చాటాడు. తన కెరీర్‌లో మొత్తం 52 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 126 వికెట్లు పడగొట్టడమే కాకుండా 1,532 పరుగులు కూడా చేశారు. అనంతరం ముంబై జట్టుకు సెలెక్టర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశారు. ఆయన చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో సచిన్ ప్రతిభను గుర్తించి ముంబై రంజీ జట్టులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సచిన్ క్రికెట్ గాడ్‌గా పేరు దక్కించుకున్నాడు.
మిలింద్ రేగే మృతిపై భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ” మిలింద్ రేగే సర్ మరణించడం చాలా బాధగా ఉంది. ఆయన ముంబై క్రికెట్ కు అపారమైన కృషి చేసిన నిజమైన క్రికెటర్. సముద్రంలో దాక్కొన్న ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించడంలో దిట్ట. ధన్యవాదాలు సార్” అని ఎమోషన్ అయ్యారు.