Monday, November 17, 2025
HomeఆటSachin Tendulkar: గాడ్ ఆఫ్ క్రికెట్‌కు మరో అత్యున్నత పురస్కారం

Sachin Tendulkar: గాడ్ ఆఫ్ క్రికెట్‌కు మరో అత్యున్నత పురస్కారం

గాడ్ ఆఫ్ క్రికెట్, భాతర లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌(Sachin Tendulkar) మరో అత్యున్నత పురస్కారం అందుకోనున్నాడు. ఈసారి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు స్వీకరించనున్నాడు. శనివారం జరగబోయే వార్సికోత్సవంలో సచిన్‌ను ‘సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్-2024’ అవార్డుతో సత్కరించనున్నట్లు బీసీసీఐ(BCCI) వర్గాలు తెలిపాయి. భారత క్రికెట్‌కు మాస్టర్ బ్లాస్టర్ అందించిన సేవలు మరుపురానివి అని ప్రశంసలు కురిపించారు. గతేడాది మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్‌ ఈ అవార్డును అందుకన్నారు. ఇక ఈ అవార్డు అందుకోబోతున్న 30వ క్రికెటర్‌గా సచిన్ నిలవబోతున్నాడు.

- Advertisement -

కాగా సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 200 టెస్టులు, 463 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఉంది. టెస్టుల్లో 15,921, వన్డేల్లో 18,426, టీ20లో 10 పరుగులు చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన తొలి ఆటగాడితో పాటు వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సచిన్ నెలకొల్పిన రికార్డులు బ్రేక్ చేయడం ఈ తరం ఆటగాళ్లకు కష్టతరమనే చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad