Team India : బంగ్లాదేశ్ పర్యటన తరువాత టీమ్ఇండియా స్వదేశంలో వరుసగా సిరీస్‌లు ఆడనుంది. కొత్త సంవత్సరంలో మూడు నెలల్లో మూడు జట్లతో భారత్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విడుదల చేసింది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు భారత పర్యటనకు రానున్నాయి. ఈ మూడు జట్లతో మొత్తం 6 టీ20లు, 9 వన్డేలు, 4 టెస్టులు ఆడనుంది టీమ్ఇండియా.
శ్రీలంక తొలుత భారత పర్యనటకు రానుంది (జనవరి 3 నుంచి 15)
టీ20 సిరీస్
ముంబైలో జనవరి 3న తొలి టీ20
పూనేలో జనవరి 5న రెండో టీ 20
రాజ్‌కోట్‌లో జనవరి 7న మూడో టీ20
వన్డే సిరీస్
గువాహతిలో జనవరి 10న తొలి వన్డే,
కోల్‌కతాలో జనవరి 12న రెండో వన్డే
త్రివేండ్రంలో జనవరి 15న మూడో వన్డే
న్యూజిలాండ్ భారత పర్యటన(జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1వరకు)
వన్డే సిరీస్
హైదరాబాద్‌లోని ఉప్పల్ లో జనవరి 18న తొలి వన్డే
రాయ్‌పూర్‌లో జనవరి 21న రెండో వన్డే
ఇండోర్‌లో జనవరి 24న మూడో వన్డే
టీ20 సిరీస్
రాంచీలో జనవరి 27 న తొలి టీ20 మ్యాచ్,
లక్నోలో జనవరి 29న రెండో టీ 20 మ్యాచ్
అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 1న మూడో టీ 20
ఆస్ట్రేలియా భారత పర్యటన(ఫిబ్రవరి 13 నుంచి మార్చి 22)
టెస్ట్ సిరీస్
నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు తొలి టెస్టు,
ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు రెండో టెస్టు
ధర్మశాల వేదికగా మార్చి 1 నుంచి 5 వరకు మూడో టెస్ట్
అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి 13 నాలుగో టెస్ట్
వన్డే సిరీస్
ముంబైలో మార్చి17న తొలి వన్డే,
విశాఖలో మార్చి 19న రెండో వన్డే,
చైన్నైలో మార్చి 22న మూడో వన్డే