Saturday, November 15, 2025
HomeఆటShubman Gill: గిల్ జిగేల్.. కోహ్లీ రికార్డు బ్రేక్.. సచిన్‌నూ దాటేశాడు.. కెప్టెన్‌గా సొంతగడ్డపై ఆ...

Shubman Gill: గిల్ జిగేల్.. కోహ్లీ రికార్డు బ్రేక్.. సచిన్‌నూ దాటేశాడు.. కెప్టెన్‌గా సొంతగడ్డపై ఆ ఘనత

Shubman Gill Breaks Virat Kohli’s Record: వెస్టిండీస్‌తో ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఈ రోజు ఆట ప్రారంభంలో సహచర ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో జరిగిన గందరగోళం కారణంగా జైస్వాల్ రనౌట్ (175) అయిన నిరాశను గిల్ త్వరలోనే బ్యాట్‌తో పారద్రోలాడు. సొంతగడ్డపై భారత టెస్ట్ కెప్టెన్‌గా ఇది గిల్‌కు మొదటి సెంచరీ కావడం విశేషం.

- Advertisement -

ALSO READ: Yashasvi Jaiswal: యశస్వి సంచలనం.. క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బ్రేక్.. 23 ఏళ్ల వయసులోనే

ఈ ఇన్నింగ్స్‌లో గిల్ అజేయంగా 129 పరుగులు సాధించాడు. ఈ సెంచరీతో గిల్ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టి, ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

కెప్టెన్‌గా వేగవంతమైన ఐదు సెంచరీలు

వెస్టిండీస్‌పై గిల్ చేసిన ఈ సెంచరీ, కెప్టెన్‌గా 2025లో అతనికి ఐదో టెస్ట్ సెంచరీగా నమోదైంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో కెప్టెన్‌గా ఐదు టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించాడు.

ALSO READ: Hardik Pandya: హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

అయితే, గిల్ ఈ ఐదు సెంచరీల మైలురాయిని కోహ్లీ కంటే వేగంగా చేరుకున్నాడు. కోహ్లీకి ఈ రికార్డు సాధించడానికి 18 ఇన్నింగ్స్‌లు పట్టగా, గిల్ కేవలం 12 ఇన్నింగ్స్‌లలోనే దీన్ని పూర్తి చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఐదు సెంచరీలు సాధించలేకపోయాడు.

మొత్తంగా ప్రపంచ క్రికెట్‌లో, కెప్టెన్‌గా అత్యంత వేగంగా ఐదు టెస్ట్ సెంచరీలు సాధించిన వారిలో గిల్ మూడో స్థానంలో ఉన్నాడు. అలస్టైర్ కుక్ (9 ఇన్నింగ్స్‌లు), సునీల్ గవాస్కర్ (10 ఇన్నింగ్స్‌లు) మాత్రమే గిల్ కంటే ముందున్నారు.

గిల్ అజేయ సెంచరీతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం వెస్టిండీస్ ఆటగాళ్లు త్యాగనరైన్ చందర్‌పాల్ (34), అలిక్ అతనాజే (41) కొంత ప్రతిఘటన చూపినప్పటికీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ దెబ్బకు త్వరగానే పెవిలియన్ చేరారు.

ALSO READ: South Africa vs Namibia: చివరి ఓవర్‌లో ఉత్కంఠ.. చారిత్రక విజయాన్ని సాధించిన నమీబియా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad