భారత స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు అందుకున్నాడు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గత నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్టేల సిరీస్‌లో ఏకంగా 259 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై సెంచరీ బాదాడు.
దీంతో ఫిబ్రవరి నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గిల్‌తో పాటు ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. అయితే అత్యధిక ఓట్లతో గిల్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. దీంతో మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు గెలిచిన ఇండియా ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

ఇక ఈ అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని గిల్ తెలిపాడు. తన బ్యాటింగ్‌లో రాణిస్తూ భారత్ తరుపున మ్యాచ్‌లు గెలవడం కంటే ఇంకేమీ ప్రేరణ ఇవ్వదన్నాడు. భవిష్యత్‌లో టీమ్ఇండియా మరిన్ని ఐసీసీ ట్రోఫీలు సాధించాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు.