Saturday, November 15, 2025
HomeఆటSmriti Mandhana : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర: ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ రికార్డు బద్దలు!

Smriti Mandhana : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర: ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ రికార్డు బద్దలు!

Smriti Mandhana World Cup Record :  భారత మహిళా క్రికెట్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్-కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో, అదీ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో ఒత్తిడిని జయించి ఆమె నెలకొల్పిన ఈ రికార్డు, ఆమె అసాధారణ ప్రతిభకు నిలువుటద్దం. ఇంతకీ స్మృతి అధిగమించిన ఆ రికార్డు ఏది? ఎవరి రికార్డును ఆమె బద్దలు కొట్టింది..? 

- Advertisement -

రికార్డుల మోత మోగించిన స్మృతి : నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితమైన ప్రపంచకప్ ఫైనల్లో స్మృతి మంధాన అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆమె, 58 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో కీలకమైన 45 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు గట్టి పునాది వేసింది. ఈ ఇన్నింగ్స్‌తో, 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆమె మొత్తం పరుగుల సంఖ్య 434కు చేరింది. తద్వారా, ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా స్మృతి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇంతకుముందు ఈ రికార్డు భారత మహిళా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 2017 ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌లలో 409 పరుగులు చేసి ఈ ఘనతను సాధించారు. తాజాగా, ఎనిమిదేళ్ల ఆ రికార్డును స్మృతి మంధాన బద్దలు కొట్టి తన పేరును అగ్రస్థానంలో లిఖించుకుంది. ఈ టోర్నమెంట్‌ ఆసాంతం నిలకడైన ప్రదర్శన చేసిన స్మృతి, 9 ఇన్నింగ్స్‌లలో 54.25 సగటుతో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం.

ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు
స్మృతి మంధాన – 434 (2025)*
మిథాలీ రాజ్ – 409 (2017)
పూనమ్ రావత్ – 381 (2017)
హర్మన్‌ప్రీత్ కౌర్ – 359 (2017)
స్మృతి మంధాన – 327 (2022)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad