Saturday, September 28, 2024
HomeఆటSrinivas Goud: తెలంగాణను క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతాం

Srinivas Goud: తెలంగాణను క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతాం

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పంజాల విష్ణువర్ధన్ గౌడ్ ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఫిబ్రవరి 14 నుండి 19 వరకు దుబాయ్ లో జరిగిన బ్యాడ్మింటన్ ఏషియా కప్ లో mixed టీం ఛాంపియన్ షిప్ లో Bronze Medal సాధించిన సందర్భంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పంజాల విష్ణువర్ధన్ గౌడ్ ను మంత్రి సన్మానించారు.

- Advertisement -

సుదీర్ఘ విరామం తర్వాత బ్యాడ్మింటన్ లో ప్రతిష్టాత్మక కప్ అయినా థామస్ కప్ ను ఇండియా జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించారు పంజాల విష్ణువర్ధన్ గౌడ్. ఇటీవల దుబాయ్ లో జరిగిన బ్యాడ్మింటన్ ఏషియా కప్ లో మిక్స్డ్ టీం ఛాంపియన్షిప్ లో Bronze Medal గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బ్యాడ్మింటన్ యువ కెరటం పంజాల విష్ణువర్ధన్ గౌడ్.
క్రీడారంగంలో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ ను కనబరుస్తు దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరం ఇప్పటికే బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్, కబడ్డి, వాలీబాల్ , బాక్సింగ్ లాంటి ఎన్నో క్రీడలలో క్రీడాకారులు విశేష ప్రతిభను కనబరుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధిస్తున్నారన్నారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులు ఒలంపిక్స్ లో, కామన్వెల్త్ లో, థామస్ కప్ లో పలు ప్రపంచ స్థాయి ఛాంపియన్షిప్లలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్న తెలంగాణ క్రీడాకారులకు సీఎం కేసీఆర్ సహకారంతో నగధు ప్రోత్సాహాలతోపాటు, ఎంతో విలువైన ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడ స్టేడియాలను నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థులను చిన్న వయసు నుండే క్రీడాకారులు తీర్చిదిద్దడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పాఠశాల ద్వారా క్రీడా శిక్షణను ఇస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News