Wednesday, October 2, 2024
HomeఆటSrinivas Reddy: క్రీడలకు అధిక ప్రాధాన్యం

Srinivas Reddy: క్రీడలకు అధిక ప్రాధాన్యం

క్రీడా స్ఫూర్తిని రగిలిద్దాం

ప్రతి నియోజకవర్గంలో స్టేడియంలు, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం ఆవరణలో 9 కోట్ల పది లక్షల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో మహబూబ్నగర్ స్టేడియం పేరుకు మాత్రమే ఉండేదని, ఎలాంటి సౌకర్యాలు లేవని , తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో మహబూబ్నగర్ లో ఇండోర్ స్టేడియం తో పాటు ,ఎంవిఎస్ కళాశాల, ఇతర ప్రదేశాలలో స్టేడియంలు నిర్మించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో స్టేడియంలు నిర్మించడం జరిగిందని, అంతేగాక ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానిదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణని తెలిపారు. ఇండోర్ స్టేడియం ను 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగిందని, అన్ని రకాల ట్రాక్ లు ఫుట్బాల్ కోర్టులు, వాలీబాల్ అకాడమీ తీసుకురావడం జరిగిందని, బాక్సింగ్ కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. 100 సంవత్సరాలుగా క్రీడలకు కనీసం 5 కోట్ల రూపాయలు జిల్లాకు రాలేదని, అలాంటిది తమ ప్రభుత్వంలో 50 కోట్లు ఖర్చుతో క్రీడలు అభివృద్ధి చేశామని తెలిపారు. స్టేడియం గ్రౌండ్ నుండి నక్లెస్ రోడ్ వరకు అనుసంధానం చేస్తామని తెలిపారు.అత్యంత ఆదునాతన సౌకర్యాలతో స్టేడియాన్ని రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. పట్టణంలో వెయ్యి పడకల ఆసుపత్రిని అత్యంత అదనాతన సౌకర్యాలతో నిర్మిస్తున్నామని, స్టేడియం గ్రౌండ్లో చేపట్టిన ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందింపజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలని క్రీడల వైపు ఆసక్తి చూపించే విధంగా తల్లిదండ్రుల సైతం కృషి చేయాలని అన్నారు. ప్రపంచ స్థాయిలో మన పిల్లలను క్రీడలువైపు తీసుకువెళ్లేందుకు స్పోర్ట్స్ ను ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్య ,స్పోర్ట్స్ ను సమానంగా చూడాల్సిన అవసరం ఉందని, అందరూ కష్టపడి పని చేస్తే క్రీడలలో మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు ఇంజనీరింగ్ అధికారులకు అభినందనలు తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ కే .నరసింహ, మున్సిపల్ చైర్మన్ కే.సీ. నరసింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News