Most Dot Balls In T20: టీ20 క్రికెట్ అంటేనే బౌండరీల వర్షం, పరుగుల సునామీ. క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, రోహిత్ శర్మ వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ బరిలోకి దిగితే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రతి బంతినీ స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా సాగే ఈ ఫార్మాట్‌లో పరుగులను కట్టడి చేయడం, డాట్ బాల్స్ వేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. అలాంటిది, ఓ బౌలర్ ఏకంగా తాను వేసిన బంతుల్లో దాదాపు సగం డాట్ బాల్స్ వేసి, ప్రపంచంలోనే అత్యంత “పిసినారి” బౌలర్‌గా అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు.
బ్యాట్స్‌మెన్ రాజ్యలో.. బౌలర్ల మహారాజు:
టీ20 ఫార్మాట్‌ను వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ శాసిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతీ లీగ్‌లోనూ వారిదే హవా. అయితే, ఆశ్చర్యకరంగా బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైన ఈ ఫార్మాట్‌లో, ఓ అరుదైన బౌలింగ్ రికార్డును నెలకొల్పింది కూడా ఒక వెస్టిండీస్ బౌలరే కావడం విశేషం. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా వెస్టిండీస్ స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ అగ్రస్థానంలో నిలిచాడు.
ALSO READ: https://teluguprabha.net/sports-news/no-pakistan-cricket-team-in-la-2028-olympics-report-says/
నరైన్ నమ్మశక్యం కాని గణాంకాలు:
సునీల్ నరైన్ తన కెరీర్‌లో వెస్టిండీస్ జాతీయ జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌లలో ఆడాడు. తన మిస్టరీ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతూ, పరుగులివ్వడంలో మాత్రం పరమ పిసినారిగా పేరు తెచ్చుకున్నాడు.
రికార్డు వివరాలు:
ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో సునీల్ నరైన్ మొత్తం 12,358 బంతులు విసిరాడు. అందులో ఏకంగా 5,421 బంతులను డాట్ బాల్స్‌గా మలిచాడు. అంటే, అతను వేసిన మొత్తం బంతుల్లో దాదాపు 44 శాతం బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదన్నమాట. ఇది టీ20 ఫార్మాట్‌లో నమ్మశక్యం కాని ఘనత.
ALSO READ: https://teluguprabha.net/sports-news/shubman-gill-chases-bradman-gavaskar-records-in-england-series/
పరుగులను కట్టడి చేయడంలో, కచ్చితమైన యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దిట్ట. అలాంటి బుమ్రా కూడా ఈ డాట్ బాల్స్ రికార్డులో నరైన్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం, నరైన్ ఘనత ఏంటో తెలియజేస్తుంది. ఈ రికార్డుతో సునీల్ నరైన్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన బౌలర్లలో ఒకడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.


