Sunday, November 16, 2025
HomeఆటRinku Singh: ఎంపీతో టీమిండియా క్రికెట‌ర్ నిశ్చితార్థం..!

Rinku Singh: ఎంపీతో టీమిండియా క్రికెట‌ర్ నిశ్చితార్థం..!

టీమిండియా యువ ఆట‌గాడు రింకూ సింగ్(Rinku Singh) త్వ‌ర‌లో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నట్లు తెలుస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా స‌రోజ్‌తో రింకూకు నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. అయితే ఈ నిశ్చితార్థానికి సంబంధించి రింకూ సింగ్, ప్రియా సరోజ్ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -

కాగా ప్రియా స‌రోజ్ ఇటీవ‌ల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మ‌చ్లిష‌హ‌ర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఆమె ఢిల్లీ యూనివ‌ర్సిటీలో చ‌దివి సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా ప‌నిచేశారు. ఆమె తండ్రి కూడా మూడు సార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రింకూ సింగ్ టీ20ల్లో కీల‌క ఆటగాడు అనే సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. రూ.13కోట్లను రింకూను కేకేఆర్ రిటైన్ చేసుకున్న విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad