Asia Cup 2025, IND vs PAK: భారత్, పాకిస్తాన్ మధ్య హ్యాండ్ షేక్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సూపర్-4 ఫైట్ లో టాస్ వేసే సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారథితో కరచాలనం చేయకుండా వెళ్లిపోయాడు. దాయాదిపై గెలిచిన తర్వాత కూడా టీమిండియా ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. అంపైర్లతో మర్యాదగా నడచుకోకపోవడంతో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ఆటగాళ్లకు క్లాస్ పీకాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సెప్టెంబర్ 21న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 పోరులో ఎప్పటిలాగే దాయాది క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. అయితే ఈ క్రమంలో అంపైర్లతో కూడా కరచాలనం చేయడం మరచిపోయి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు టీమిండియా క్రికెటర్లు. ఈ క్రమంలో మన ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై కోచ్ గంభీర్ మండిపడ్డారు. అంపైర్లతో మర్యాదగా నడుచుకోవాలని ఆదేశించారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ నుంచి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లు అంపైర్లతో కరచాలనం చేశారు.గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి అంపైర్లకు షేక్ హ్యాండ్ చేయమని అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆసియా కప్ లీగ్ దశలో కూడా భారత్ జట్టు చిరకాల ప్రత్యర్థిని ఓడించింది. సెప్టెంబరు 14న జరిగిన ఈ మ్యాచ్ లో సూర్య సేనా పాకిస్తాన్ ఆటగాళ్లకు కరచాలనం చేయడానికి ఇష్టపడలేదు. టీమిండియా ఆటగాళ్ల చర్యపై పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ టోర్నీ నుంచి వైదొలుగుతామని కూడా బెదిరించింది.
Also Read: Ind vs Pak – ‘బై బై పాకిస్థాన్..’ అంటూ స్టేడియంలో యువతి హల్ చల్, వీడియో వైరల్


