Sunday, November 16, 2025
HomeఆటICC Women’s World Cup: మహిళా వరల్డ్ కప్‌ విజయంలో ఒకే ఒక్కడు.. కోచ్‌ అమోల్...

ICC Women’s World Cup: మహిళా వరల్డ్ కప్‌ విజయంలో ఒకే ఒక్కడు.. కోచ్‌ అమోల్ ముజుందార్ నేపథ్యమిదే..!

The Real Hero Behind Team India World Cup Victory: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాపై భారీ విజయాన్ని సాధించి తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. 1978లో మొట్టమొదటిసారి ఐసీసీ మహిళల క్రికెట్ పోటీలో అడుగుపెట్టిన భారత మహిళా జట్టు 47 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మహిళల వన్డే ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ గెలుపు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. వరుసగా 1978, 1997, 2013, 2025లో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యమిచ్చినప్పటికీ కప్‌ను గెలుచుకోవడం మాత్రం ఇదే మొదటిసారి.

- Advertisement -

భారత మహిళా జట్టు విజయంలో కీలక పాత్ర..

ప్రతి పురుషుని విజయం వెనుక అదృశ్యంగా ఒక స్త్రీ పాత్ర ఉంటుందని అంటుంటారు. అయితే, భారత మహిళా క్రికెట్ జట్టు అసాధారణ విజయం వెనుక ఒక పురుషుని కృషి ఉంటుంది. ఆయన మరెవరో కాదు భారత ప్రఖ్యాత మేటి బ్యాటర్ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీల మిత్రుడు, సమకాలీనుడు అమోల్ ముజుందార్. ఆయన కూడా సచిన్ టెండూల్కర్ ను దేశానికి అందించిన రమాకాంత్ అచ్రేకర్ శిష్యుడే. అమోల్ ముజుందార్ భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర వహించాడు. 2014లో రిటైర్ అయిన తర్వాత ఆయన కోచ్‌గా స్థిరపడ్డాడు. భారతదేశంలోని అండర్-19, అండర్-23 జట్ల శిక్షణతో ప్రారంభమైన ఆయన ప్రతిభ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా, ఐపిఎల్ ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్‌లో బ్యాటింగ్ కోచ్‌గా, నెదర్లాండ్స్ పురుషుల జట్టు కోచ్‌గా అంతర్జాతీయంగా ఆయన పేరు ప్రఖ్యాతలు సాధించారు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి దాదాపు 10 నెలలుగా ఖాళీగా ఉండటంతో, భారత క్రికెట్ నియంత్రణ మండలి అమోల్ ముజుందార్‌ను అక్టోబర్ 2023లో నియమించింది. అంతర్జాతీయ క్రికెట్ పెద్దగా మొదట్లో ఆయన నియామకంపై వివాదం నెలకొన్నప్పటికీ, కోచ్‌గా అద్భుతమైన దేశీయ రికార్డు, నైపుణ్యం స్వల్పకాలంలోనే ఆటగాళ్లతో సహా క్రికెట్ వర్గాలను ఆకర్షించింది. భారత మహిళా జట్టు అద్భుతంగా రూపాంతరం చెంది మొట్టమొదటిసారి 2025 ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ఆయన శిక్షణా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. టోర్నమెంట్ ప్రారంభంలోనే ఓడిపోయినప్పటికీ ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా, పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుపై సెమీఫైనల్‌లో గొప్ప విజయం సాధించింది. అమోల్ ముజుందార్ శిక్షణా నైపుణ్యానికి గొప్ప మైలురాయిగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

కోచ్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులు..

ముజుందార్ అంతర్జాతీయ క్రీడాకారుడిగా అవార్డులను అందుకోకపోయినా, కోచ్‌గా విజయాలు అసాధారణ మలుపుగా పరిగణించబడుతున్నాయి. అతని ప్రభావవంతమైన నాయకత్వం భారత మహిళా క్రికెట్‌ను ప్రపంచ వేదికపై ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంతో పాటు యువ క్రీడాకారులు, కోచ్‌లకు స్ఫూర్తినిచ్చింది. భారత మహిళా జట్టు తొలి ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు వారికి తగు శిక్షణనిచ్చి క్రీడానైపుణ్యంతో పాటు మానసికంగా సంసిద్ధులను చేసిన తీరు భారతదేశ మహిళా క్రికెట్ చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుంది.

అమోల్ ముజుందార్ నేపథ్యం..

ఉన్నత చదువుల కోసం శారదాశ్రమ విద్యామందిర్‌లో చేరిన అమోల్ ముజుందార్ లెజెండరీ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ఆధ్వర్యంలో తన క్రికెట్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నాడు. భారత దేశీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లను శారదాశ్రమ విద్యామందిర్‌ అందించింది. తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే 260 పరుగులు చేసిన ముజుందార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక సంచలన ఆటగాడిగా వెలుగులోకి వచ్చాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రెండు దశాబ్దాలకు పైగా ఉన్న తన అద్భుతమైన కెరీర్‌లో, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 11,000 పరుగులు, 30 సెంచరీలు సాధించడం రంజీ ట్రోఫీలోనే రికార్డు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన నైపుణ్యంతో దాదాపు 50 సగటుతో బొంబాయి జట్టు సారధిగా 8 సార్లు రంజీ ట్రోఫీ టైటిల్ సాధించారు. తన అద్భుతమైన ఆటతీరుతో “నెక్ట్స్‌ టెండూల్కర్” గా పేరు తెచ్చుకున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad