ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ(Lalit Modi)కి భారీ షాక్ తగిలింది. భారత్‌లో వందల కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్టు లలిత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన విదేశాలకు పరారయ్యారు. అప్పటి నుంచి అతడిని భారత్ కు రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అతడు మాత్రం విదేశాల చట్టాలను ఉపయోగించుకుని తప్పించుకూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దేశమైన వనాటు గోల్డెన్ పౌరసత్వం పొందారు.
దీంతో లలిత్ మోడీ చేసిన ఆర్థిక మోసాలపై అంతర్జాతీయంగా వార్తలు ప్రచురితమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆదేశ ప్రధానమంత్రి జోథం నపట్ పౌరసత్వం రద్దు చేయాలని అధికారలను ఆదేశించారు. భారత్‌కు అప్పగింత నుంచి తప్పించుకోవడానికి తమ దేశ పౌరసత్వాన్ని ఉపయోగించుకుంటున్నట్టు నపట్ కార్యాలయం వెల్లడించింది. కాగా లలిత్ మోడీ 2010లో భారతదేశం విడిచి వెళ్లారు. ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణలు రావడంతో అతడిపై వేటు పడింది. అనంతరం లండన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం లండన్ నుంచి మకాం మార్చి వనాటలుతో ఉంటున్నాడు.