Saturday, July 27, 2024
HomeఆటVijayawada: సిఎస్ ను కలిసిన అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి

Vijayawada: సిఎస్ ను కలిసిన అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి

అంధుల ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్

అర్జున అవార్డు గ్రహీత, అంధుల ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా సిఎస్ అజయ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన అజయ్ కుమార్ 2002 నుండి జిల్లా, రాష్ట్ర, జోనల్ జాతీయ స్థాయిలో అంధుల క్రికెట్ టీంలో క్రీడాకారునిగా ఆడారు. అనంతరం 2010 నుండి ఇండియన్ స్వ్కాడ్ గాను, 2016 నుండి అంధుల ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా పనిచేస్తున్నారు.

- Advertisement -

అజయ్ కెప్టెన్సీలో ఇండియా 2017,2022లో రెండు సార్లు అంధుల టి-20 వరల్డ్ కప్ సాధించారు. 2018లో వన్ డే వరల్డ్ కప్ ను సాధించారు. 2016లో ఆసియా కప్,2023లో ఐబిఎస్ఏ ప్రపంచ క్రీడల్లో రజత పధకాన్ని సాధించారు. 18 టోర్నమెంట్లకు గాను 13 మాన్ ఆఫ్ ది సీరిస్ అవార్డులు సాధించారు. ప్రపంచ ఫాస్టెస్ట్ అంధుల క్రికెటర్ గా అజయ్ కుమార్ రెడ్డి నిలిచారు. 2012 ఇంగ్లాండులో జరిగిన అంధుల క్రికెట్ టోర్నమెంట్ లో 33 బంతుల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రీడాకారునిగా అజయ్ కుమార్ రెడ్డి రికార్డుల్లో నిలిచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News