Monday, December 23, 2024
HomeఆటVinod Kambli: ఐసీయూలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ

Vinod Kambli: ఐసీయూలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli) అనారోగ్యంతో మరోసారి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబరు 21న ఠానేలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాంబ్లీ చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్ననాటి కోచ్ రమాకాంత్‌ ఆచ్రేకర్ స్మారక కార్యక్రమంలో పాల్గొన్న కాంబ్లీ సరిగా నిలబడేందుకూ కూడా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో తన టీమ్‌మేట్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌(Sachin) కాంబ్లీని అప్యాయంగా పలకరించారు.

- Advertisement -

ఇదిలా ఉంటే కాంబ్లీకి చికిత్స అందించేందుకు 1983 వన్డే ప్రపంచకప్‌ విజేత టీమ్‌ సిద్ధంగా ఉందని మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్(Kapil Dev) ఇటీవల ప్రకటించిన విషయం విధితమే. అయితే ఒరిహాబిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్తేనే సాయం చేస్తామని షరతు విధించారు. ఇందుకు కాంబ్లీ కూడా అంగీకరించారు. మొత్తానికి 1990ల్లో తన ఆట తీరుతో అలరించిన కాంబ్లీ.. తన ప్రవర్తనతో క్రికెట్ కెరీర్‌కు దూరమై వ్యసనాలకు బానిసయ్యారు. లేదంటే తనకున్న నైపుణ్యంలో సచిన్‌తో పాటు పేరు ప్రఖ్యాతలు దక్కించుకునే వారని క్రీడా విశ్లేషకులు చెబుతూ ఉంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News