టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ(Virat Kohli) రిటైర్‌మెంట్ ప్రకటించారు. 14 ఏళ్ల పాటు భారత్ తరఫున టెస్టులకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని తెలిపారు. ఈమేరకు ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్ చేశారు. తన కెరీర్‌లో 123 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో కోహ్లీ మరో 770 పరుగులు చేస్తే 10 వేల పరుగులు మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. కానీ ఈలోపే రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులకు షాక్‌కి గురిచేసింది. కాగా ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027 వన్డే వరల్డ్‌కప్ గెలవడమే లక్ష్యంగా రోహిత్, కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు క్రీడా నిపుణులు చెబుతున్నారు.