ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ జట్టును భారత బౌలర్లు ఇబ్బందులు పెట్టారు. అయితే స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మాత్రం అడ్డుగోడగా నిలబడ్డాడు. ఆచితూచి ఆడుతూ అర్థ సెంచరీ నమోదు చేశాడు.
ఈక్రమంలో కేన్ మామను అక్షర్ పటేల్(Axar Patel) బోల్తా కొట్టించాడు. స్లోగా వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో భారత్ విజయం ఖరారైంది. ఈ నేపథ్యంలో కీలకమైన వికెట్ తీసిన అక్షర్ పటేల్‌ను విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రత్యేకంగా అభినందించాడు. అక్షర్ కాళ్లను నమస్కరించేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే లీగ్ దశలో మూడు విజయాలు సాధించిన భారత్ గ్రూప్ ఏ టాపర్‌గా నిలిచింది. దీంతో గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.