Team India Squad for Asia cup 2025:సెప్టెంబర్ 9న యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో ఎవరెవరు ఉంటారనేది నెట్టింట జోరుగా జరుగుతున్న చర్చ. అయితే ఈ క్రమంలో జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉంటాడా లేదా అనేదా అందరిలోనూ మెదిలితున్న ప్రశ్న. తాజాగా బుమ్రా టీమ్ లో ఉంటాడని తేల్చి చెప్పింది పీటీఐ నివేదిక. ఫిట్‌నెస్, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు గత ఇంగ్లండ్ సిరీస్ లో కొన్ని టెస్టులు మాత్రమే ఆడించారు.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. గత ఆసియా కప్ ను గెలుచుకున్న టీమిండియా ఈసారి కూడా టైటిల్ ను నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బుమ్రా జట్టులో ఉండాలని మేనేజ్మెంట్ బలంగా కోరుకుంటోంది. ఈ మెగా టోర్నీమెంట్ ప్రారంభమయ్యే నాటికి బుమ్రాకు నెలన్నర రోజులు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ లోని తొలి మ్యాచ్ కు విశ్రాంతి ఇవ్వవచ్చని పీటీఐ రిపోర్టు వెల్లడించింది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 28న జరగనుంది. మరోవైపు భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ అక్టోబరు 2 నుంచి ప్రారంభకానుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఆగస్టు 19 లేదా 20 నాటికి ఆసియా కప్ కోసం ఇండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ నివేదిక ఆధారంగా జట్టును ఎంపిక చేయనున్నారు.
ఆసియాకప్ కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహారించనున్నాడు. అయితే వైస్ కెప్టెన్ గా అక్షర్ లేదా గిల్ లేదా పాండ్యాల్లో ఎవరో ఒకరు వ్యవహారించనున్నారు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, సూర్యకుమార్, తిలక్ వర్మ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యశస్వి జైస్వాల్ మరియు సాయి సుదర్శన్ లకు జట్టులో చోటు దక్కడం కష్టమే. మరోవైపు స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు కూడా టీమ్ లో ఫ్లేస్ ఉండకపోవచ్చు. గాయం నుంచి ఇంక కోలుకోలేకపోవడంతో నితీష్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశం లేదు.
Also Read:MS Dhoni – మీరు ఆడాలి సార్ అన్న అభిమాని..”మరి నా కాలి నొప్పిని ఎవరు భరిస్తారని అడిగిన ధోనీ!
భారత జట్టు (అంచనా): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్మాన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిద్ రానా లేదా ప్రసిద్ధ్ క్రిష్ణ, హర్దిక్ పాండ్యా, జితేష్ శర్మ లేదా ధృవ్ జురెల్.


