Sunday, November 16, 2025
HomeఆటWomen T20: వల్డ్ కప్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందన

Women T20: వల్డ్ కప్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందన

ఇండియా వుమెన్స్ టీ20 వల్డ్ కప్ 2023కి కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందనను వైస్ కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది. వుమెన్స్ వల్డ్ కప్ ఫిబ్రవరిలో జరగనుంది. ఆల్ ఇండియా వుమెన్స్ సెలెక్షన్ కమిటీ 15 మంది స్ట్రాంగ్ ప్లేయర్స్ తో టీం ఎంపిక చేయగా వారిలో వివాదాస్పదంగా ప్లేయర్ శిఖా పాండేకు ఛాన్స్ దొరికింది. వెటరన్ పేసర్ శిఖాను అంతకు ముందు జట్టు నుంచి తొలగించారు. సౌత్ ఆఫ్రికాలో వచ్చే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వల్డ్ కప్ మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్ 2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, ఐర్లండ్, భారత్ ఉండగా తొలి మ్యాచే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ గా కేప్ టౌన్ లో వల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 26న ఫైనల్స్ జరగనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad