Monday, November 17, 2025
HomeఆటWorld cup in Inorbit mall: ఇనార్బిట్ మాల్ లో వల్డ్ కప్

World cup in Inorbit mall: ఇనార్బిట్ మాల్ లో వల్డ్ కప్

సిటీలో 'క్యాచ్ ద మ్యాచ్ విత్ నిస్సాన్'

నిస్సాన్ నేతృత్వంలో జరుగుతున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో కప్ ను ప్రదర్శించారు. ట్రోఫీని దగ్గర నుంచి చూసి, దానితో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. నిస్సాన్ కూడా ఒక ప్రత్యేకమైన పోటీ ‘క్యాచ్ ద మ్యాచ్ విత్ నిస్సాన్’ తో ప్రేక్షకులతో సరదాగా నిర్వహించింది. ఈ సందర్బంగా ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌ సెంటర్ హెడ్ శరత్ బెలవాడి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని తమ ప్రాంగణంలో ట్రోఫీని ప్రదర్శించినందున మా అభిమానులు ఆనందాన్ని పొందారని మేము భావిస్తున్నామని తెలిపారు. ఇందులో వినియోగదారులు ఐసీసీ ప్రపంచ కప్ టిక్కెట్‌లను గెలుచుకునే అవకాశం అందించిందన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీని మా మాల్‌కు స్వాగతిస్తున్నందుకు మేము థ్రిల్‌గా ఉన్నామన్నారు. టీమ్ ఇండియా మ్యాచ్‌ల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో కె రహేజా కార్ప్ సిఓఓ శ్రావణ్ గొనె, నగర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad