Yashasvi Jaiswal| టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైశ్వాల్ టెస్టుల్లో పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే టెస్టుల్లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 1280 పరుగుల చేశాడు. మరో 283 పరుగులు సాధిస్తే టీమిండియా తరపున ఓ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. 2010లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 14 మ్యాచులు పడి 1562 పరుగులు చేశాడు. ఇప్పటివరకు భారత్ తరపున ఈ పరుగులే అత్యధికం.
అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈనెల మరో మూడు టెస్టులు జైశ్వాల్ ఆడనుండటంతో సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్‌గా పాకిస్థాన్ లెజెండ్ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ టాప్‌లో ఉన్నాడు. 2006లో 11 టెస్టుల్లో యూసఫ్ 1,788 పరుగులు చేశాడు. కాగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడిలైడ్ వేదికగా ఈనెల 6న ప్రారంభం కానుంది.