క్రీడల్లో యువత రాణించాలని రాష్ట్ర సాంస్కృతిక సారధి ,మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో గత వారం రోజుల నిర్వహిస్తున్న సర్పంచ్ కప్ క్రికెట్ , తగ్గ ఆఫర్ ఫైనల్ మ్యాచ్ లో విన్నర్ గా క్రికెట్ లో క్లబ్ లెవెన్, టగ్ ఆఫర్ విన్నర్ గా గ్రామ ముదిరాజ్ టీం నిలిచింది. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం రసమయి మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి యువత ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మానసిక ఉల్లాసంతో పాటు క్రీడలు స్నేహ భావాన్ని పెంపోందిస్తూ, వ్యక్తిలో మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంపొందేల దోహద పడుతాయని చెప్పారు. యువత సన్మార్గంలో వెళ్లుతూ క్రీడ ల పట్ల ఆసక్తి పెంపొందించుకొని, మంచి గుర్తింపు గ్రామానికి తీసుకురావాల్సిన బాధ్యత ఆ గ్రామ యువకులపై ఉందనే విషయాన్ని యువత గుర్తించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ గౌడ్, రవీందర్ రెడ్డి, శంకర పట్నం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్. ఎస్సై లక్ష్మారెడ్డి, తాడికల్ సర్పంచ్ కీసర సుజాత సంపత్. ఎంపీటీసీ బుద్ధార్తి వరలక్ష్మి సంపత్. మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి ,పోటీల ఆర్గనైజార్స్ కోడూరి రాహుల్ ,సాయి, నిరంజన్ , సీనియర్ క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.