Thursday, March 20, 2025
Homeఆటచాహల్, ధనశ్రీ విడాకులు మంజూరు.. భరణం తీసుకోవడంపై ట్రోల్స్..!

చాహల్, ధనశ్రీ విడాకులు మంజూరు.. భరణం తీసుకోవడంపై ట్రోల్స్..!

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ గురువారం ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. ఇద్దరూ వేర్వేరు కోర్టుల వెలుపల కనిపించారు. మార్చి 20న బాంబే హైకోర్టు చాహల్, ధనశ్రీ విడాకుల్ని ఆమోదించింది. విడాకులకు సంబంధించిన ప్రక్రియ ఇరు న్యాయవాదుల సమక్షంలో పూర్తయిందని వారు తెలియజేశారు. విడాకుల మంజూరు ప్రక్రియలో భాగంగా, చాహల్ ధనశ్రీకి రూ.4.745 కోట్లు భరణంగా చెల్లిస్తారని కోర్టు నిర్ణయించింది.

- Advertisement -

ధనశ్రీ కోర్టుకు హాజరు అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, చాలా మంది ఆమెపై వల్గర్ కామెంట్స్ చేస్తూ ఉంటే, కొందరు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ధనశ్రీ వర్మ కుటుంబ సభ్యులు కూడా ఆమెతో పాటు కనపడ్డారు. కోర్టుకు హాజరైన సమయంలో ఆమె వైట్ టీ-షర్టు, నీలిరంగు జీన్స్ వేసుకుని, ముఖం మీద నల్లటి సన్ గ్లాసెస్‌తో పాటు మాస్క్ పెట్టుకొని వేగంగా కోర్టులోకి వెళ్లిపోయింది. మీడియాకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వచ్చిందని తెలుస్తోంది. ఫోటోగ్రాఫర్స్ ఆమె ఫోటోలు తీయడానికి పోటీ పడ్డారు.

మార్చి 20న కోర్టు చాహల్, ధనశ్రీ విడాకులను ఆమోదించింది. వారి న్యాయవాది కూడా విడాకులు పరస్పర అంగీకారంతో జరిగాయని ప్రకటించారు. బార్ అండ్ బెంచ్ వెబ్‌సైట్ ప్రకారం, చాహల్, ధనశ్రీ వివాహం చేసుకుని నాలుగేళ్లు అయినా, గత రెండున్నర సంవత్సరాలుగా విడిగా నివసిస్తున్నారు. ఇప్పుడు వారు రూ.4.75 కోట్లకు సెటిల్మెంట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో బాంబే హైకోర్టు 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను రద్దు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News