భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, నటి-కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల విడాకుల విచారణ మార్చి 20న జరగనుంది. ఐపీఎల్‌లో చాహల్ పాల్గొననున్న నేపథ్యంలో మార్చి 20 (గురువారం)న విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించిందని బార్ అండ్ బెంచ్ నివేదించింది. విడాకుల ప్రక్రియను వేగవంతం చేస్తూ, ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయిస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఫిబ్రవరి 5న చాహల్, ధనశ్రీ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. విచారణలో భాగంగా భరణం కింద ధనశ్రీకి రూ.4.75 కోట్లు చెల్లించేందుకు చాహల్ అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే రూ. 2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అయితే సెటిల్‌మెంట్ నిబంధనలను పాక్షికంగా మాత్రమే పూర్తి చేశారని కోర్టు గుర్తించిందని బార్ అండ్ బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో విడాకుల పిటిషన్‌పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. కాగా భరణం చెల్లింపు వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.