Friday, November 22, 2024
HomeఆటAchchampet: ఆటలాడిన కలెక్టర్, మున్సిపల్ చైర్మన్

Achchampet: ఆటలాడిన కలెక్టర్, మున్సిపల్ చైర్మన్

జోనల్ క్రీడలు ప్రారంభం

  ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు- వసతి గృహాల విద్యార్థినీ, విద్యార్థుల అండర్ 14, అండర్ 17 జోనల్‌ స్థాయి క్రీడా పోటీలను అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్యఅథితిగా హాజరైన నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్ క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడా ప్రతాకావిష్కరణ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.

- Advertisement -

అంతకుముందు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాల నుంచి వచ్చిన 1657 మంది గురుకుల క్రీడాకారులు అధికారులకు, మార్చ్‌ఫాస్ట్‌ చేసి అధికారులతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి, పోటీలకు ప్రారంభానికి ముందు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.


క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తి ముఖ్యం
క్రీడాస్ఫూర్తితో ఆడిన వారే భవిష్యత్‌లో రాణిస్తారని కలెక్టర్‌ ఉదయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ…. అచ్చంపేట మూడోసారి జోనల్ క్రీడలకు ఆతిథ్యమిస్తుందని అందుకు కృషి చేస్తున్న అధికారులకు ప్రజా ప్రతినిధులను ఆయన అభినందించారు. విద్యార్థులను పోటీ ప్రపంచంలో పోటీపడేలా ఉపాధ్యాయులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. 7 జిల్లాల నుంచి వచ్చిన బాల బాలికలు ఆత్మవిశ్వాసంతో ఆడి విజయం సాధించాలన్నారు.
కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే క్రీడా కార్యక్రమాలు నిర్వహించస్తామన్నారు. తను కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినేనని క్రీడల ప్రాముఖ్యత ఎలా ఉంటుందో తనకు తెలుసు అని చెప్పారు. విద్యార్థుల్లోని గ్రామీణ విద్యార్థుల్లో దాగిన ప్రతిభను బయటకు తీసేందుకు జోనల్‌ స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, రింగ్ బాల్, అథ్లెటిక్‌, ఇండోర్‌, బాస్కెట్‌బాల్‌ పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రతి విద్యార్థి జోనల్ రాష్ట్ర జాతీయస్థాయిలో రాయనించాలని ఆకాంక్షించారు. పోటీల్లో పాల్గొన్న టీంలు నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి ,జోగులాంబ గద్వాల జిల్లా నుంచి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల నుంచి 1657 మంది క్రీడాకారులు హాజరయ్యరు.


వీరికి అండర్‌–14, 17,లో వాలీబాల్‌, బాల్‌, కబడ్డీ, ఖోఖో, టెన్నీ కాయిట్‌, క్యారమ్స్‌, చెస్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌, హ్యాడ్‌బాల్‌తో పాటు అథ్లెటిక్‌ పోటీలు నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు నాగర్ కర్నూల్ గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు.
జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు భద్రాచలంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
అంతకుముందు వక్తలు మున్సిపల్ చైర్మన్ పలువురు అధికారులు విద్యార్థుల క్రీడా విశిష్టతపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ అచ్చంపేట ఆర్డీవో గోపిరామ్ నాగర్ కర్నూల్ డి టి డబ్ల్యూ కమలాకర్ రెడ్డి నల్లగొండ డి టి డబ్ల్యూ రాజ్ కుమార్ సూర్యాపేట డి టి డబ్ల్యూ శంకర్ ఏ టి డబ్ల్యూ లక్ష్మారెడ్డి బాలకృష్ణ అచ్చంపేట ఎంఈఓ రామారావు అచ్చంపేట సీఐ అనుదీప్ ఆయా జిల్లాల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏ టి డబ్ల్యూ లు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News