కృత్రిమ మేధస్సు తో నడిచే టీ, కాఫీ యంత్రాన్ని కరీంనగర్ లో బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా కరీంనగర్ లో కృత్రిమ మేధస్సు తో నడిచే టీ, కాఫీ సెంటర్ ను ప్రారంభించడం గర్వంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జెమ్ ఓ ఓపెన్ క్యూబ్ కంపెనీ సహాయంతో నడిచే ఈ ఆధునిక యంత్రము కరీంనగర్ లో ప్రారంభించడం ఇదే మొదటిసారి అని, కంపెనీ నిర్వాహకులు వినోద్ వివరించారు. ప్రపంచంలోనే మొదటగా గోల్డ్ ఏటీఎం ప్రారంభించిన జెమ్ ఓ ఓపెన్ క్యూబ్ కంపెనీ మొదటిసారిగా కరీంనగర్ లో కృత్రిమ మేధస్సుతో నడిచే టీ, కాఫీ యంత్రాన్ని 24 గంటలు మనుషుల సహాయం లేకుండా నడిపించడము వివిధ టీ, కాఫీ హోటల్ లకు భిన్నంగా ఉందని విర్వాహకులు అన్నారు. కేవలము డిజిటల్ పేమెంట్ పద్ధతిలో టీ,కాఫీ,నీరు, బాధం మిల్క్, లెమన్ టీ తో కూడుకున్న పానియాలు మిషనరీ నుంచి రావడం విశేషం అని, తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ స్థాయి నుంచి ఈ యొక్క మిషనలను అందిస్తామని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ సీఈవో వినోద్ సూచించారు. కంపెనీ కృత్రిమ మేధస్సు తో నడిచే ఈ యంత్రాన్ని రూపాయలు 1,67,000 వేలకు అందిస్తున్నట్లు తెలిపారు.
AI Coffee machines: కరీంనగర్ లో కృత్రిమ యంత్రం ఇచ్చే టీ, కాఫీలు
24 గంటలు వాటర్, కాఫీ, టీ ఇచ్చే మెషీన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES