Sunday, November 16, 2025
Homeటెక్నాలజీTablets Under 20K: శామ్సంగ్ నుంచి వన్ ప్లస్ వరకు..కేవలం రూ.20,000 లోపు లభించే బెస్ట్...

Tablets Under 20K: శామ్సంగ్ నుంచి వన్ ప్లస్ వరకు..కేవలం రూ.20,000 లోపు లభించే బెస్ట్ టాబ్లెట్స్!

Best Tablet Deals Under 20K: పండుగ సేల్ సమయంలో తక్కువ ధరకు శక్తివంతమైన ఫీచర్లతో బ్రాండెడ్ టాబ్లెట్ లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అనేక టాబ్లెట్ లు చవక ధరకే అందుబాటులో ఉన్నాయి. ఇవి అద్భుతమైన ఫీచర్లతో కేవలం రూ.20 వేల లోపు అందుబాటులో ఉండటం విశేషం. ఈ జాబితాలో వన్ ప్లస్ నుంచి ఒప్పో వరకు ఉన్నాయి. చాలారోజుల నుంచి సరసమైన ధరకే బ్రాండెడ్ టాబ్లెట్ కొనాలని చూస్తుంటే ఈ డీల్స్ ఉత్తమ ఎంపికలు అవుతాయి.

- Advertisement -

Samsung Galaxy Tab A11

దక్షిణ కొరియా టెక్ కంపెనీ శామ్సంగ్ నుండి వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 టాబ్లెట్ కాంపాక్ట్ 8.7-అంగుళాల TFT LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ టాబ్లెట్ కేవలం రూ.17,999 ధరకు లిస్ట్ అయింది. ఇది WiFi కనెక్టివిటీని అందిస్తుంది.

 

OnePlus Pad Go

వన్ ప్లస్ ప్రీమియం టాబ్లెట్ వన్‌ప్లస్ ప్యాడ్ గో ను కస్టమర్లు కేవలం రూ.16,999 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది 2.4K LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. డాల్బీ అట్మాస్ మద్దతుతో స్పీకర్లను కూడా కలిగి ఉంది.

Redmi Pad 2

రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ 2.5K రిజల్యూషన్, యాక్టివ్ పెన్ సపోర్ట్‌తో 11-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని ధరరూ.16,999. ఇది హైపర్‌ఓఎస్ 2తో వస్తుంది.

Chuwi Aupad Android 14

ఆండ్రాయిడ్ 14పై పనిచేసే ఈ చువి ఔపాడ్ ఆండ్రాయిడ్ 14 టాబ్లెట్ 2K డిస్‌ప్లే స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది వైడ్‌వైన్ L1కి కూడా మద్దతు ఇస్తుంది. దీని కేవలం రూ.14,900కి ఆర్డర్ చేయవచ్చు.

 

Samsung Galaxy Tab A9

శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A9 టాబ్లెట్ రూ.16,862 తగ్గింపు ధరకు లభిస్తుంది. ఇది 11-అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది WiFi, 5G కనెక్టివిటీని కూడా అందిస్తుంది.

Lenovo Idea Tab Smartchoice

లెనోవో ఐడియా ట్యాబ్ స్మార్ట్‌చాయిస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను అందించారు. ఇందులో డాల్బీ అట్మోస్ మద్దతుతో నాలుగు స్పీకర్లు ఉన్నాయి. ఈ టాబ్లెట్ గ్రే రూ.15,990కు అందుబాటులో ఉంది.

Redmi Pad Pro

ఈ రెడ్‌మి టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంది. హైపర్‌ఓఎస్ పై పనిచేసే ఈ పరికరాన్ని డిస్కౌంట్ తర్వాత రూ.18,999 కు కొనుగోలు చేయవచ్చు.

OnePlus Pad Lite

ఈ వన్ ప్లస్ టాబ్లెట్‌లో 500nits బ్రైట్‌నెస్‌తో 11-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 9340mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కాగా, ఈ టాబ్లెట్ రూ.15,999 కు లభిస్తుంది.

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad