Friday, November 22, 2024
Homeటెక్ ప్లస్BharOS: మేడిన్ ఇండియా ఆపరేటింగ్ సిస్టమ్స్ BharOS

BharOS: మేడిన్ ఇండియా ఆపరేటింగ్ సిస్టమ్స్ BharOS

ఫ్రీ, ఓపన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంను మనదేశం దేశీయంగా తయారు చేసుకుంది. ఈ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చటం విశేషం. ఈ కొత్త ఓఎస్ పేరు భరోస్ గా పెట్టడం విశేషం. ఈ ఆపరేటింగ్ సిస్టంను ప్రభుత్వ, పబ్లిక్ సిస్టమ్స్ లో ఉపయోగించనున్నారు. ఈమేరకు కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భరోస్ ను టెస్ట్ చేశారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెడ్రాస్ (ఐఐటీ మద్రాస్) దీన్ని అభివృద్ధి చేసింది. ఓఎస్ అభివృద్ధి చేయటంలో చొరవ చూపిన వారందరినీ మంత్రి ధర్మేంద్ర అభినందించారు. డిజిటల్ ఇండియాలో మరో కీలక అడుగు పడినట్టు ఆయన అభివర్ణించారు.

- Advertisement -

విదేశాలకు చెందిన ఓఎస్ డౌన్లోడ్లపై ఆధారపడకుండా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లలో ఇక మేడిన్ ఇండియా టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని కేంద్రం ధీమా వ్యక్తంచేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News