Sunday, November 16, 2025
Homeటెక్నాలజీDiscount: గూగుల్ పిక్సెల్ 9 పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Discount: గూగుల్ పిక్సెల్ 9 పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Google Pixel 9: మీరు చాలారోజులుగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనీ ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్ న్యూస్! గూగుల్ పిక్సెల్ 9 భారీ డిస్కౌంట్ తో నందుబాటులో ఉంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం దాని లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్‌పై గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. పరిమిత-కాల ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌ల తర్వాత ఇప్పుడు ఈ పరికరాన్ని రూ.55,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ గూగుల్ పరికరంలో ఇన్-హౌస్  టెన్సర్ G4 చిప్‌సెట్, అనేక AI-ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ కెమెరాలు, క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ డీల్‌, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
డిస్కౌంట్ ఆఫర్:
గూగుల్ పిక్సెల్ 9 లాంచ్ సమయంలో అసలు ధర రూ.79,999. అయితే, ప్రస్తుతం ఈ పరికరం ఏకంగా రూ.25,000 తగ్గింపుతో ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ.54,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ప్రత్యేక బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక్కడ  ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు, ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది. దీని వలన వినియోగదారులు ఎటువంటి అదనపు ఇంట్రెస్ట్  చెల్లించకుండా ఈ అద్భుతమైన ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.41,500 వరకు ఎక్స్ఛేంజ్ విలువను పొందవచ్చు. ఇది పాత హోనే ధర, కండిషన్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.
ఫీచర్లు:
గూగుల్ నుండి వచ్చిన ఈ శక్తివంతమైన ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 1,800 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని కూడా అందిస్తుంది. ఈ పరికరం తాజా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఇది గూగుల్ ఫోన్  టెన్సర్ G4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 12GB వరకు ర్యామ్, 256GB అంతర్గత నిల్వను కూడా కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం..పిక్సెల్ 9 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో 10.5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే..ఇది 27W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad