Flipkart Big Billion Days Sale: ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఇందులో LED టీవీలపై గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు చాలా సరసమైన ధరకు LED కొనాలని చూస్తున్నట్లయితే, ఈ సేల్‌లో చాలా ఎంపికలు కొనుగోలుకు ఉన్నాయి. ఇక్కడ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న కొన్ని బడ్జెట్-ఫ్రెండ్లీ LED టీవీల గురించి తెలుసుకుందాం. ఈ టీవీలు రూ.5,000 లోపు ధరకే లభించడం విశేషం. అతి తక్కువ ధరకే ఈ టీవీలు అద్భుతమైన డిస్ప్లే, ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తాయి.
MarQ by Flipkart 60 cm (24 inch) HD Ready LED TV (24HDNDQEETB)
ఈ LED టీవీ ధర రూ.4,599. ఆఫర్‌లో భాగంగా ఈ టీవీని 5% క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, రూ.162 నుండి ప్రారంభమయ్యే EMIతో ఈ టీవీని కూడా పొందవచ్చు. ఫీచర్ల పరంగా..ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానెల్‌తో వస్తుంది. ఇది 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో HD-రెడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కంపెనీ 20W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.
also read:Moto G06 Power: టెక్ లవర్స్ కు పండగే..మోటో నుంచి సరికొత్త మొబైల్..కీలక ఫీచర్స్ లీక్..
InnoQ Sounbar 60 cm (24 inch) HD Ready LED TV
ఈ టీవీ 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో HD-రెడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 30W శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఈ టీవీ రూ.4,690 ధరకు లిస్ట్ అయింది. ఈ టీవీపై 5% క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. రూ.165 నుండి ప్రారంభ EMIతో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.
Uniboom ULTIMA 60 cm (24 inch) HD Ready LED TV 2025 Edition
కస్టమర్లు ఈ టీవీని కేవలం రూ.4,991ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీపై 5% క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ టీవీని రూ.176 నుండి ప్రారంభ EMIతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే..ఈ టీవీ 1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో HD-రెడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.


