Sunday, September 8, 2024
Homeటెక్ ప్లస్Cyber crime: సైబర్ నేరాలపై స్కూల్ స్థాయిలోనే అవగాహన

Cyber crime: సైబర్ నేరాలపై స్కూల్ స్థాయిలోనే అవగాహన

ఉమెన్ సేఫ్టీ వింగ్ ,తెలంగాణ పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే సందర్భంగా… C.A.P. సైబర్ అంబాసిడర్స్ ప్లాట్ ఫామ్ లాంచ్ ప్రోగ్రామ్ జరిగింది. సైబర్ అంబాసిడర్స్ ఫ్లాట్ ఫామ్ లోగోను ఆవిష్కరించిన హోంమంత్రి మహమూద్ ఆలీ.. దేశంలోనే తెలంగాణ పొలీసులు నెంబర్ అంటూ పేర్కొన్నారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని..కరోనా టైం నుంచి సెల్ ఫోన్స్ స్కూల్స్ లో సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ ,ప్రభుత్వ స్కూల్ లో ఈ సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతి స్కూల్ నుంచి నలుగురిని సెలెక్ట్ చేసి సైబర్ నేరాలపై ట్రైనింగ్ ఇచ్చి.. ఆ స్కూల్స్ లో అందరికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, 380 స్కూల్స్ లో అప్రమత్తం చేస్తారని వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. పెట్రోల్ వెహికిల్స్ లాగా సైబర్ పెట్రోల్ వచ్చిందని..సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలని అంజనీ పిలుపునిచ్చారు. సేఫ్టీ అంటే ఫిజికల్ నే కాకుండా డేటా,సెక్యూరిటీ ,సేఫ్టీ లో ముందుండాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News