Sunday, November 16, 2025
Homeటెక్నాలజీDiwali Smart Tv Offers: కేవలం రూ. 5 వేలకే కొడాక్‌ స్మార్ట్‌టీవీ.. ఇప్పుడు వదులుకుంటే...

Diwali Smart Tv Offers: కేవలం రూ. 5 వేలకే కొడాక్‌ స్మార్ట్‌టీవీ.. ఇప్పుడు వదులుకుంటే మళ్లీ అస్సలు దొరకదు..!

Diwali Offers on Kodak Smart TV: దసరా సేల్‌లో అనేక ఉత్పత్తులపై బంపరాఫర్లు ప్రకటించిన ఈ-కామర్స్‌ సైట్లు.. రాబోయే దీపావళి సందర్భంగా మరోసారి ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అంతేకాదు, కొన్ని ఎలక్ట్రానిక్‌ కంపెనీలు కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ కొడాక్ భారత మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. ఈ కంపెనీ ఏకంగా మొత్తం 17 స్మార్ట్ టీవీ మోడల్స్‌పై ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్స్‌లో భారీ డిస్కౌంట్లతో కొత్త స్మార్ట్‌టీవీలను అమ్మకానికి పెట్టింది. అయితే, ఏ టీవీపై ఎంత డిస్కౌంట్‌ లభిస్తుందో ఓసారి పరిశీలిద్దాం.

- Advertisement -

అమెజాన్‌ దివాళీ సేల్‌లో భారీ డిస్కౌంట్లు..

దీపావళి ఆఫర్‌ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో కొడాక్ 409X5061 స్మార్ట్‌టీవీ కేవలం రూ.13499 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. మరోవైపు, కొడాక్ 24QSE5002 రూ.5999, కొడాక్ 24SE5002 రూ. 5999, కొడాక్ 32HDX900S రూ.6999, కొడాక్ 32SE5001BL రూ.7999, కొడాక్ 32QSE5080 రూ.8199, కొడాక్ 329X5051 రూ.9499, కొడాక్ 32MT5077 రూ.9499, కొడాక్ 40QSE5009 రూ.11999, కొడాక్ 43SE5004BL రూ.13299, కొడాక్ 439X5081 రూ.15299, కొడాక్ 43ST5005 రూ.18799, కొడాక్ 50ST5015 రూ.23999, కొడాక్ 55ST5025 రూ.27649, కొడాక్ 65ST5035 రూ.38999, కొడాక్ 43QSE5073 రూ.13799, కొడాక్ KQ43JTV0010 రూ.17499 ధర వద్ద లభిస్తాయి. అంతేకాదు, ఇటీవల విడుదలైన కొడాక్‌ 55 ఇంచ్ క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని సైతం భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఆఫర్లన్నీ అమెజాన్ వెబ్‌సైట్లో మాత్రమే లభిస్తాయని కంపెనీ తెలిపింది.

ఫెస్టివల్‌ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్లు..

మరోవైపు, ఈ స్మార్ట్‌టీవీల కొనుగోలుపై భారీ తగ్గింపుతో పాటు కార్డు ఆఫర్లను కూడా అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఈఎంఐ కింద కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,750 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌తో కలిపి ఈ 55 అంగుళాల క్యూఎల్‌ఈడీ టీవీని కేవలం రూ.25,899 వద్ద ఆఫర్ ధరకే పొందవచ్చు. ఈ 55 అంగుళాల క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి రిలీజైంది. ఇందులో 4K యూహెచ్‌డీ క్యూఎల్‌ఈడీ ప్యానెల్, 60Hz రిఫ్రెష్ రేట్ గల డిస్‌ప్లే ఉంటుంది. హెచ్‌డీఆర్‌ 10 మెరుగైన పనితీరు కోసం దీనిలో AiPQ చిప్‌సెట్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్ట్ ఉన్న క్వాడ్ స్పీకర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఏఐ స్మూత్ మోషన్ రేట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీపావళి సీజన్‌లో తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ టీవీ కొనాలనుకునే వారికి బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad