ఈ సంవత్సరం ప్రారంభంలో బంగారం ధరల్లో కొంత మార్పు చోటు చేసుకున్నప్పటికీ, ఫిబ్రవరిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ పెరుగుదలతో సామాన్య ప్రజలు, వ్యాపారులు, పెట్టుబడిదారులు కొంచెం ఆందోళన చెందారు. అయితే, మార్చి ప్రారంభంలో కొంత తగ్గాయి.
ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు మరింత పెరిగినప్పటికీ, మార్చి మొదటి వారంలో ధరలు కాస్త తగ్గాయి. ఇది బంగారం కొనాలని అనుకుంటున్న వారికీ ఊరట కలిగించాయి. కానీ గత రెండు రోజులుగా ధరలు మళ్లీ పెరిగాయి.
మార్చి 11న బంగారం ధరలు తిరిగి తగ్గాయి. 22 క్యారట్ల బంగారం ధర ₹30 తగ్గి రూ.8020 (ఒక గ్రాము)కి చేరింది. అంటే, 10 గ్రాములు రూ.80200. 24 క్యారట్ల బంగారం ధర రూ.33 తగ్గి రూ.8749 కి పడిపోయింది. 10 గ్రాములకు రూ.87490గా ఉంది.
మార్చి 12న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారట్ల బంగారం ధర రూ.45 పెరిగి రూ.8065 కి చేరింది. 10 గ్రాములు రూ.80650 గా ఉంది. అలాగే, 24 క్యారట్ల బంగారం ధర రూ.49 పెరిగి రూ.8798కి చేరింది. అంటే, 10 గ్రాములు రూ.87980.
మార్చి 13న బంగారం ధర మరింత పెరిగింది. 22 క్యారట్ల బంగారం రూ.55 పెరిగి రూ.8120, 10 గ్రాములు రూ.81200గా ఉంది. 24 క్యారట్ల ధర రూ.60 పెరిగి రూ.8858, 10 గ్రాములు రూ.88580 గా ఉంది.
నిపుణుల ప్రకారం, బంగారం కొనాలని అనుకున్నవారు మరికొన్ని రోజులు ఆగి వేచి ఉంటే మంచిది. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.