గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గుతుంది అనుకున్న ప్రతిరోజు కుడా అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బంగారం ధరలు చూస్తే కొనాలి అన్న ఆలోచన కుడా ఉండట్లేదు. బంగారం కొనాలి అనే మనసు మార్చుకుంటున్నారు. ఇప్పుడు కొనకపోతే ఇంకా పెరిగిపోతుందేమో అనే భయం కొంత ఆలోచనలో పడేస్తుంది. భవిష్యత్తులో తగ్గితే ఇప్పుడు కొన్నవారు మళ్లీ బాధపడాలి ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి.
బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. భారతదేశంలో ఎక్కువగా బంగారం ప్రధానంగా పండుగ సమయాల్లో, పెళ్లి సీజన్లలో పెద్దఎత్తున కొనుగోలు చేస్తారు. వీటి వల్ల ధరలు పెరుగుతుంటాయి. ప్రజలు గోల్డ్ ETF లు లేదా బంగారం లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తగిన ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, బంగారం ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేయాలంటే జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే ఫిబ్రవరి 16 వ తేదీన బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా నికరంగా ఉన్నాయి. ఫిబ్రవరి 17న 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 7940 గా ఉంది. అంటే పది గ్రాముల ధర రూ. 79400 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 8662 గా ఉంది. అంటే 10 గ్రాముల ధర రూ.86620 గా ఉంది.
కానీ ఈరోజు బంగారం ధరలు మరలా పెరిగాయి. 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.30 లు పెరిగి రూ.7970 గా ఉంటే 10 గ్రాములకు రూ.79700 కి పెరిగింది. అంటే నిన్నటి మీద 10 గ్రాములకు రూ.300 పెరిగింది. అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాముకి రూ.33 లు పెరిగి రూ.8695 గా ఉంది అంటే 10 గ్రాముల బంగారం ధర రూ. 86950 గా ఉంది. ఈ ధరలు ఇలానే ఉంటాయనే నమ్మకం లేదు. మరలా పెరగవచ్చు, తగ్గవచ్చు అని భావిస్తున్నారు. బంగారం మీద పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది సరైన సమయం ఆ కాదా అని, ధరలు పెరిగే దాని మీద ఆధారపడి ఉంటుంది.