బంగారం కొనాలని అందరికీ ఉంటుంది, కానీ దీని ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు బంగారం కొనడం ఒక కలగా మారింది. ప్రస్తుతం బంగారం ధరలు మామూలుగా ఉండడమే కాదు. ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. కనీసం వాటి వైపు కుడా చూడలేని పరిస్థితి. బంగారం అనేది భవిష్యత్తులో ఆస్తిగా భావిస్తారు. అయితే, ధరలు పెరిగినా, కొంతమంది మాత్రం దీన్ని కొనలేకపోతున్నారు. మరికొంతమంది, వారి ఆర్థిక పరిస్థితుల వలన, గిల్టు నగలతో ఫ్యాషన్‌ను కొనసాగిస్తున్నారు. దీనితో, బంగారం ధరలు పెరిగి, అందరికి అందుబాటులో ఉండకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది.
ఈ పరిస్థితిలో, వన్ గ్రాం గోల్డ్ అనేది చాలా ఫేమస్ అయింది. అచ్చం బంగారమేలా కనిపించే ఈ నగలు, ప్రామాణిక బంగారంతో సమానమైన మెరుపు కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ నగల డిమాండ్ భారీగా పెరిగింది. వన్ గ్రాం గోల్డ్ మరింత అందుబాటులోకి వస్తుండటం, మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప పరిష్కారంగా మారింది.
ల్యాబ్ మేడ్ గోల్డ్ ఇప్పుడు బంగారం కొనలేని వారి కోసం అందుబాటులో ఉంది. 99 శాతం రాగి, సిల్వర్, అల్యూమినియం పదార్థాలతో 1% బంగారం కలిపి ఈ గోల్డ్ తయారు చేస్తారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమైన ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ తయారీ, ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉంది. బంగారం పై క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. భారతీయ సంప్రదాయంలో మహిళల కోసం బంగారం ఎప్పటికీ ప్రాధాన్యం పొందిన వస్తువుగా ఉంటే, ఈ క్రేజ్ ఎప్పటికీ కొనసాగుతుంది.