ఆడవాళ్లకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి చీరలు, రెండు నగలు.. మొదటిది ఎలా ఉన్నా రెండోది మాత్రం పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా అయితే అందనంత దూరాన్న పరుగెడుతున్నాయి. ఇదెలా కొనసాగితే భవిష్యత్తులో మధ్యతరగతి కుటుంబాలకు బంగారం దొరకదేమో అనిపిస్తుంది. అలా అని బంగారం షాపులు ఈగలు కొట్టుకుంటున్నాయా బంగారం ధర ఎంత పెరిగినా మాకు సంబంధం లేదు అన్నట్టు ఉన్న వాళ్లు అలా కొంటూనే ఉన్నారు. డిమాండ్ పెరిగే కోల్దీ రేటు పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసా.. ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్‌లో ధరలు ఇలా..
నిన్న ఫ్రిబ్రవరి 5 వ తేదీన 22 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.7,905 లు ఉంది. అంటే పది గ్రాముల బంగారం ధర రూ.79,050 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 8,624 ఉంది అంటే 10 గ్రాముల ధర రూ.86,240 గా ఉంది.
ఈరోజు ఫ్రిబ్రవరి 6వ తేదీన 22 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 25 సు పెరిగి రూ.7930 వద్ద ఉంది అంటే 10 గ్రాముల ధర రూ. 79,300 వద్ద నిలిచింది. అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.27 లు పెరిగి ఒక గ్రాము రూ. 8651 వద్ద నిలిచింది అంటే 10 గ్రాముల బంగారం ధర రూ. 86,510 లుకా ఉంది. మరి రేపటి బంగారం ధర నిలకడగా ఉంటుందా లేదా పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాలి..