గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గుతుంది అనుకున్న ప్రతిరోజు కుడా కెరటంలా పైకి లేస్తున్నాయి. ఈ రేట్లను చూస్తూ బంగారం కొనాలి అనుకున్నవారు మనసు మార్చుకుంటున్నారు. ఇంకా పెరుగుతుందేమో అన్న భయంతో ఇప్పుడే కొనేద్దాం లేదంటే ఇంకా పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. భారతదేశంలో ఎక్కువగా బంగారం ప్రధానంగా పండుగ సమయాల్లో, పెళ్లి సీజన్లలో పెద్దఎత్తున కొనుగోలు చేస్తారు. వీటి వల్ల ధరలు పెరుగుతుంటాయి. ప్రజలు గోల్డ్ ETF లు లేదా బంగారం లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తగిన ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, బంగారం ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేయాలంటే జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే నిన్న బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా, ఫిబ్రవరి 12న 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 7940 గా ఉంది. అంటే పది గ్రాముల ధర రూ. 79400 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 8667 గా ఉంది. అంటే 10 గ్రాముల ధర రూ.86670 గా ఉంది.
కానీ ఈరోజు బంగారం ధరలు మరలా పెరిగాయి. 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.40 పెరిగి రూ.7980 గా ఉంటే 10 గ్రాములకు రూ.79800 కి పెరిగింది. అంటే నిన్నటి మీద 10 గ్రాములకు రూ.400 పెరిగింది. అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాముకి రూ.38 లు పెరిగి రూ.8705 గా ఉంది అంటే 10 గ్రాముల బంగారం ధర రూ. 87050 గా ఉంది. ఈ ధరలు ఇలానే ఉంటాయనే నమ్మకం లేదు. మరలా పెరగవచ్చు, తగ్గవచ్చు అని భావిస్తున్నారు. బంగారం మీద పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది సరైన సమయం ఆ కాదా అని, ధరలు పెరిగే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఫిబ్రవరి 11 వ తేదీతో పోలిస్తే ఈరోజు బంగారం ధర తక్కువే ఉంది..