గత రెండు వారాలుగా బంగారం ధరలు మారుతూ వస్తున్నాయి. మొదటిగా, గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గి, మళ్లీ పెరిగాయి. ఈ మార్పులు గమనిస్తూ, బంగారం కొనాలంటే ప్రజలకు భయం ఏర్పడింది. పెరిగిన ధరలు చూసి, సామాన్యులు బంగారం షాపుల వైపు వెళ్లడం మానేశారు. ఇటీవల, బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. రెండు రోజుల క్రితం, దేశీయ బంగారం ధర రూ.90,000 ను టచ్ చేసింది. అయితే, పెళ్లిళ్ల సీజన్ వచ్చి, కొందరు బంగారం కొనక తప్పడం లేదు.
ఈ నేపథ్యంలో, పసిడి ప్రియుల కోసం మంచి వార్తే ఇది. ఈ రోజు బంగారం ధరలు కొంచెం తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 24, 22 క్యారెట్ల బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నాయి.
మార్చి 17 నాటికి, హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.89,670 నుంచి రూ.89,560 వరకు తగ్గింది. 110 రూపాయలు తగ్గాయి. అదే విధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి, రూ.82,100కు చేరింది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,200గా ఉంది. అంటే 100 గ్రాములకు రూ.1000 తగ్గినట్టు.. 18 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. నిన్న రూ.67,260 వద్ద ఉన్న 18 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.67,180కి పడిపోయింది. అలాగే, దేశీయంగా కిలో వెండి ధర రూ.1,03,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడలో ఇది రూ.1,11,900గా ఉంది.