Sunday, November 16, 2025
Homeటెక్నాలజీHero HF Deluxe Pro: రూ.73,550కే కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో లాంచ్.. తక్కువ బడ్జెట్‌లో...

Hero HF Deluxe Pro: రూ.73,550కే కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో లాంచ్.. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు!

Hero HF Deluxe Pro Launched: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఈసారి తన ఎంట్రీ లెవల్ బైక్ న్యూ HF డీలక్స్ ప్రోను భారతదేశంలో విడుదల చేసింది. HF 100, HF డీలక్స్ ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. అయితే, HF డీలక్స్ ప్రో మునుపటి మోడళ్ల కంటే కొంచెం అధునాతనమైనది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 73,550. ఇప్పుడు ఈ బైక్ ధర ఎంత? ఇంజిన్ ఎంత శక్తివంతమైనది? ఇందులో ఎలాంటి ఫీచర్లు అందించారో వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Hero HF Deluxe Pro ఫీచర్లు:

హీరో కొత్త HF డీలక్స్ ప్రో లుక్ తాజాగా కనిపిస్తుంది. ఈ బైక్ పెట్రోల్ ట్యాంక్, ఇతర భాగాలపై స్పోర్టి గ్రాఫిక్స్ ఇచ్చారు. దీనికి కొత్త LED హెడ్‌లైట్ ఉంది. డిజైన్ పరంగా..ఈ కొత్త HF డీలక్స్ ప్రోను యువతను ఆకర్షిస్తోంది. ఇది చాలా రిచ్, కలర్‌ఫుల్‌గా ఉండే డిజిటల్ స్పీడోమీటర్‌ను కలిగి ఉంది. ఈ బైక్ కు 18 అంగుళాల టైర్లు అందించారు. ఈ బైక్ వెనుక భాగంలో 130mm డ్రమ్ బ్రేక్ సౌకర్యం ఉంది. దీని వెనుక సస్పెన్షన్ ను 2 దశల్లో సర్దుబాటు చేయవచ్చు. బైక్ టైర్లు, సస్పెన్షన్ మెరుగైన, సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందించడంలో సహాయపడతాయి.

Also Read: MG M9: ఎంజీ నుంచి నయా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్ తో 548KM రేంజ్..

Hero HF Deluxe Pro ఇంజిన్:

కొత్త HF డీలక్స్ ప్రో 97.2cc ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 7.9 bhp, 8.05 Nm టార్క్ ను ఇస్తుంది. ఈ ఇంజిన్ i3S (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) టెక్నాలజీతో అమర్చబడి ఉంది. ఇది ఏ పరిస్థితిలోనైనా మెరుగ్గా పనిచేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ మెరుగైన మైలేజీని అందిస్తుంది. ఈ ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంది.

Hero HF Deluxe Pro ధర:

హీరో మోటోకార్ప్ హీరో HF డీలక్స్ ప్రో బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 73,550 వద్ద ఉంచింది. ఈ బైక్‌ను ఎంట్రీ లెవల్ బైక్ విభాగంలో విడుదల చేశారు. ఈ విభాగంలో ఇది బజాజ్, TVS, హోండా వంటి ద్విచక్ర వాహన తయారీదారుల బైక్‌లతో నేరుగా పోటీపడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad